Rayachoty: సంబేపల్లి మండలంలో ఘనంగా సచివాలయ భవన ప్రారంభోత్సవం!
Rayachoty; అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దుద్యాల గ్రామంలో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
Rayachoty: సంబేపల్లి మండలంలో ఘనంగా సచివాలయ భవన ప్రారంభోత్సవం!
Rayachoty: సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం చిన్నకోడివండ్ల పల్లెలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు నూతన సచివాలయ భవనాన్ని పరిశీలించి, గ్రామ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువగా, వేగవంతంగా అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




