Chinnamandem: బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!

Chinnamandem: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Nov 2026 9:34 AM IST
Chinnamandem
X

Chinnamandem: బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!

Chinnamandem: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డి గారిపల్లెలోని తన స్వగృహంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, వినతులను మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విన్న మంత్రి గారు, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని మంత్రి గారు భరోసా కల్పించారు.

ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలనే సంకల్పంతో ప్రజాసేవలో నిరంతరం ముందుకు సాగు తున్నామన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI