Rayachoti: ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!

Rayachoti: రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలోని తన నివాసంలో మంత్రి మండిపల్లి ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 15 Oct 2026 10:33 AM IST
Rayachoti
X

Rayachoti: ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలోని తన సొంత నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, వినతులను మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి గారు, వారి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాదర్బార్ ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమం తెలియజేస్తోంది. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజాదర్బార్ కార్యక్రమం కొనసాగింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI