Rayachoti: రాయచోటిలో ఘనంగా మంత్రి మండిపల్లి ప్రజాదర్బార్!

Rayachoti: రాయచోటి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి. పూర్తి వివరాలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Sept 2026 9:46 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ఘనంగా మంత్రి మండిపల్లి ప్రజాదర్బార్!

Rayachoti: రాయచోటి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి ఆప్యాయంగా కలుసుకుని, వారి సమస్యలు, వినతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు అందించిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI