Rayachoti: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి ప్రజా దర్బార్!
Rayachoti: రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం పడమటి కోనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను విన్నారు.
Rayachoti: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి ప్రజా దర్బార్!
Rayachoti: చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యతగా మంత్రి పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.




