Rayachoti: సీఎం సభ భోజన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మండిపల్లి!
Rayachoti: మదనపల్లె సీఎం సభకు వెళ్లే కార్యకర్తల భోజన ఏర్పాట్లను మంత్రి మండిపల్లి పరిశీలించారు.
Rayachoti: సీఎం సభ భోజన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మండిపల్లి!
Rayachoti: మదనపల్లెలో శుక్రవారం జరగనున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సభకు తరలివెళ్లే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నమండెం మండలం బెస్తపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తన మేనల్లుడు మౌర్య రెడ్డి గారితో కలిసి పరిశీలించారు.
సీఎం సభకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లే నాయకులు, కార్యకర్తలకు సమయానికి నాణ్యమైన భోజనం అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భోజన ప్రాంగణంలో తాగునీరు, భోజన వసతులు తదితర సౌకర్యాలను పరిశీలిస్తూ, ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడంలో భాగంగా తరలివెళ్లే ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.




