Rayachoti: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి మండిపల్లి
Rayachoti: రాయచోటి రామాపురం మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం.
Rayachoti: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి మండిపల్లి
Rayachoti: రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రామాపురం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.




