Rayachoti: సుబ్బరాజు మృతి పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతాపం!

Rayachoti: రాజు స్కూల్స్ అధినేత సుబ్బరాజు మృతి పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 5 Nov 2026 4:07 PM IST
Rayachoti
X

Rayachoti: సుబ్బరాజు మృతి పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతాపం!

Rayachoti: రాజు స్కూల్స్ అధినేత, రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ జగన్మోహన్ తండ్రి సుబ్బరాజు గారి మరణం పట్ల రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాయచోటి సిద్ధ్యాలలలోని సుబ్బరాజు గారి నివాసానికి చేరుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సుబ్బరాజు గారి మరణం వారి కుటుంబానికి, బంధుమిత్రులకు తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI