Rayachoti: శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నేతల అల్లర్లు హేయమైన చర్య.. మంత్రి!
Rayachoti: శాప్ కార్యాలయం వద్ద దేవినేని అవినాష్, జోగి రమేష్ వర్గీయుల అల్లర్లను తీవ్రంగా ఖండించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Rayachoti: శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నేతల అల్లర్లు హేయమైన చర్య.. మంత్రి!
Rayachoti: దేవినేని అవినాష్ జోగి రమేష్ రౌడీ గ్యాంగ్ తో శాప్ కార్యాలయం వద్ద రాళ్లు, కోడిగుడ్లతో అల్లర్లకు పాల్పడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
ప్రభుత్వ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఉపాధ్యాయులపై దాడికి యత్నించడం హేయమైన చర్య అని డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు.
కష్టపడి ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులు, ఉపాధ్యాయులను అవమానించడం సరికాదన్నారు.
ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పద్ధతి కాదని శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ కార్యాలయం వద్ద ఉద్రిక్తత సృష్టించడం తగదన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల వద్ద అల్లర్లు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం వైసీపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.




