Rayachoti: షుగర్ వ్యాధితో కాలు కోల్పోయిన రసయ్యను పరామర్శించిన మంత్రి!
Rayachoti: షుగర్ వ్యాధితో కాలు కోల్పోయిన రాయచోటి మండలం పార్లపల్లికి చెందిన రసయ్యను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.
Rayachoti: షుగర్ వ్యాధితో కాలు కోల్పోయిన రసయ్యను పరామర్శించిన మంత్రి!
Rayachoti: రాయచోటి మండలం బొట్లచెరువు గ్రామం పార్లపల్లికి చెందిన రసయ్య షుగర్ వ్యాధి కారణంగా కాలును కోల్పోయిన విషయం తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయనను పరామర్శించారు.
రసయ్యను కలిసి ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి గారు, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో వివరాలు తెలుసుకుని, అవసరమైన సహాయ సహకారాల గురించి కూడా ఆరా తీశారు.
ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. రసయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.




