Mydukur: రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి పూర్తిగా కృషి చేస్తానని వెల్లడి!

Mydukur: మైదుకూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షులుగా మారెళ్ల రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 8 Oct 2026 5:14 PM IST
Mydukur
X

Mydukur: రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి పూర్తిగా కృషి చేస్తానని వెల్లడి!

Mydukur: మైదుకూరు నియోజకవర్గం వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షులుగా మారెళ్ళ రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. గురువారము ఆయన దువ్వూరులో మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు మాజీ శాసనసభ్యులు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి, దువ్వూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు మైదుకూరు నియోజకవర్గ ప్రచారపు విభాగం అధ్యక్షులుగాతనను నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మారెళ్ల రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

తన మీద నమ్మకంతో మైదుకూరు నియోజకవర్గం ప్రచార విభాగం అధ్యక్షుడుగా నియమించినందుకు తన వంతూ పార్టీకి కృషి చేస్తానని తెలిపారు. రాబోవు స్థానిక సంస్థలు , సాధారణ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం కృషి చేస్తానని రాజశేఖర్ రెడ్డి తెలిపారు . తదితరులు అభినందనలు తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR