Sambepalli: వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన లక్ష్మీప్రసాద్ రెడ్డి!
Sambepalli: సంబేపల్లి మండలం కొండవాండ్లపల్లిలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి.
Sambepalli: వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన లక్ష్మీప్రసాద్ రెడ్డి!
Sambepalli: సంబేపల్లి మండలం నారాయణరెడ్డి పల్లి గ్రామం కొండవాండ్లపల్లి లో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు.
కొండవాండ్లపల్లి లో బిజెపి నాయకుడు రేపన శివప్రసాద్ ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు అభినందించారు. ప్రజలందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




