Kadapa: ప్రొద్దుటూరులో టీడీపీకి భారీ షాక్.. వైఎస్సార్‌సీపీలోకి 80 కుటుంబాలు!

Kadapa: ప్రొద్దుటూరులో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిన 80 కుటుంబాలు. రాజకీయంగా చర్చనీయాంశం.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 8 Oct 2026 4:47 PM IST
Kadapa
X

Kadapa: ప్రొద్దుటూరులో టీడీపీకి భారీ షాక్.. వైఎస్సార్‌సీపీలోకి 80 కుటుంబాలు!

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సిద్ధాంతాలకు ఆకర్షితులై దాదాపు 80 కుటుంబాలు టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భారీ చేరికల కార్యక్రమం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ​ ప్రొద్దుటూరు లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.

స్థానిక 24వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 80 టిడిపి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాయి. ​24వ వార్డు ఇంచార్జ్ వెంకటరమణారెడ్డి, రాజేష్,నేతృత్వంలో ఈ చేరికల కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, కోలాహలంగా జరిగింది.

చేరిన వారందరికీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వంశీధర్ రెడ్డి, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సిద్ధాంతాలు, పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలకు ఆకర్షితులయ్యే తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని చేరిన నాయకులు, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, నిరుపేదల సంక్షేమానికి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి వైఎస్‌ఆర్‌సీపీ ఎల్లప్పుడూ నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. ​పార్టీపై నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ రాబోయే రోజుల్లో సముచిత స్థానంతో పాటు తగిన గౌరవం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ చేరికలకు నిరంతరం శ్రమించిన స్థానిక నేతలు రమణారెడ్డి, కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, వంశీ, కదరయ్య, గణేష్, హర్ష, రమణ, శివ లతో పాటు పలువురు వైసిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR