Madanapalle: 3వ వార్డు అభివృద్ధే లక్ష్యం: వైసీపీ అభ్యర్థి రుక్సార్ సుల్తానా!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 3వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ రుక్సార్ సుల్తానా నామినేషన్ దాఖలు చేశారు. వార్డు అభివృద్ధే ధ్యేయమన్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 18 Oct 2026 9:46 PM IST
Madanapalle
X

Madanapalle: 3వ వార్డు అభివృద్ధే లక్ష్యం: వైసీపీ అభ్యర్థి రుక్సార్ సుల్తానా!

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 3వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ ముహమ్మద్ హనీఫ్ భార్య షేక్ రుక్సార్ సుల్తానా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలు కోరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని 3వ వార్డు ప్రజలను షేక్ రుక్సార్ సుల్తానా, షేక్ ముహమ్మద్ హనీఫ్ కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle