Madanapalle: మదనపల్లెలో గంగాదేవి అవతారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు!
Madanapalle: మదనపల్లెలో దసరా ఉత్సవాల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు గంగాదేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
Madanapalle: మదనపల్లెలో గంగాదేవి అవతారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు!
మదనపల్లె: మదనపల్లె పట్టణంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు గంగాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ.. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని రోజుకో అవతారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాండు, ట్రెజరర్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ యల్లంపల్లి ప్రశాంత్, లక్కీ టైల్స్ నగేష్, ఆనంద్, సంఘ సభ్యులు పాణి, శివ, చైతన్య, వినోద్, నందన్, శ్రీరాములు, సంతోష్, నాగరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు.




