Kondapuram: స్థానిక సంస్థల పోరుకు బీజేపీ సిద్ధం: జడపల్లి మహేష్
Kondapuram: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని కొండాపురం మండల బీజేపీ పదాధికారుల సమావేశంలో బూత్ స్థాయి బలోపేతానికి కార్యచరణను రూపొందించారు.
Kondapuram: స్థానిక సంస్థల పోరుకు బీజేపీ సిద్ధం: జడపల్లి మహేష్
కొండాపురం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొండాపురం మండలంలో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పదాధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. మండల బీజేపీ అధ్యక్షులు జడపల్లి మహేష్ ఆధ్వర్యంలో మండల పార్టీ పదాధికారుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం,మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం,పార్టీని బలోపేతం చేయడం,జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు బీజేపీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పదాధికారులకు సూచించారు.
ప్రతి గ్రామంలో పార్టీ కార్యకలాపాలను చురుకుగా నిర్వహిస్తూ,బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ పెంచేలా పనిచేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి గంగసాని మధు, ఉపాధ్యక్షులు కూకట్ల కృష్ణారావు,శీలం మాల్యాద్రి,కార్యదర్శులు గుమ్మడిల్లి కొండలరావు,పులివర్తి నారాయణ,బీజేవైఎం నాయకులు జడపల్లి నరేష్,బడుగు దర్గాబాబు, తలమంచి సునీల్తో పాటు పలువురు పార్టీ నాయకులు, పదాధికారులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




