Sangampeta: కడప సంగంపేటలో యువకుడిపై కత్తితో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు!

Sangampeta: కడప నగరంలోని సంగంపేట రాముల గుడి సమీపంలో వ్యక్తిగత విభేదాలతో యువకుడిపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో యువకుడితో పాటు మాజీ కార్పొరేటర్‌కు గాయాలయ్యాయి.

G. RAVI KUMAR, KADAPA
Published on: 26 Oct 2026 7:50 AM IST
Sangampeta
X

Sangampeta: కడప సంగంపేటలో యువకుడిపై కత్తితో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు!

Sangampeta: కడప నగరంలో వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా అడ్డుకునే ప్రయత్నంలో మాజీ కార్పొరేటర్‌కు కూడా గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కడప నగరంలోని సంగంపేట రాముల గుడి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 25న సాయంత్రం సమయంలో షేక్ అలీ ఖలీద్ అనే 30 ఏళ్ల యువకుడిపై సయ్యద్ బాషా అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే దాడికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. కత్తితో కడుపులో పొడవడంతో అలీ ఖలీద్‌కు తీవ్ర రక్తగాయాలయ్యాయి.

దాడిని అడ్డుకునే క్రమంలో అలీ ఖలీద్ ఎడమ చేతికి, మాజీ కార్పొరేటర్ షేక్ షంషీర్ బాషా చేతికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారు కడప హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలు, గత విభేదాల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు తెలిపారు. ఘటనను రాజకీయాలకు ముడిపెట్టి అవాస్తవ ప్రచారం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కడప రెండో పట్టణ యూజీ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA