Punganur: పుంగనూరులో టీడీపీని గెలిపించి మాట నిలబెట్టుకున్నాం: మధుసూదన్

Punganur: పుంగనూరు మున్సిపాలిటీని సీఎం చంద్రబాబుకు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను మంత్రి లోకేష్‌కు కానుకగా ఇచ్చామని టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు తెలిపారు.

MAHESH, PUNGANOOR
Published on: 8 Nov 2026 5:52 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో టీడీపీని గెలిపించి మాట నిలబెట్టుకున్నాం: మధుసూదన్

పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి టిడిపి పార్టీ ని గెలిపించి రుజువు చేశారు. గత వైసిపి పార్టీలో ఎవరి కి వారు నామినేషన్ వేసుకొని ఎంపీటీసీ, ఎం.పీ.పి గా నిలిచారని అయితే ప్రజలు ఇప్పుడు స్వచ్ఛందంగా ఓట్లు వేసి తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకున్నారని పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఐదు మండలాల్లో జడ్పిసి లు అలాగే ఎంపీటీసీలు గెలవడం చాలా గర్వంగా ఉందని, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ప్రజలు మాకు గెలుపునిచ్చి మరింత బాధ్యతలు పెంచారని అన్నారు.

ఇది మా విజయం కాదు మా కార్యకర్తల విజయం.అని గతంలో ఈ ఆరు మండలాలలో ప్రతిపక్ష పార్టీ పెట్టిన ఇబ్బందులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గతంలో ఎన్నికలు ఎవరంతటివారు నామినేషన్లు వేసుకొని ఎంపీపీ ఎంపీటీసీలు అయ్యారనేది ప్రజలందరికీ తెలుసు.

మా నాయకులు మాకది నేర్పిలేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి నాయకుని అనుకునే విధంగా ఎన్నికలు నిర్వహించారు. ప్రజలు మాకు విజయాన్ని చేకూర్చి మరింత బాధ్యతలు పెంచారు. మా కుటుంబంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు మరింత నమ్మకం తో ప్రజలు ఆదరించారు. దీనిని మేము గుర్తుపెట్టుకుని ప్రజలకు చేరువై ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. గత గొడ్డలి పార్టీ దాడిలో గాయపడ్డ మా కార్యకర్తలు 25 మందికి మేము అండగా చేదోడు వాదోడిగా ఉండి ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఎంపీపీ అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

నియోజకవర్గం ఎంపిటిసి, జెడ్పిటిసి లు ఇంచార్జి ని ఘనంగా సన్మానించారు.

మీడియా సమావేశంలో పుంగనూరు నియోజకవర్గం లోని వివిధ పంచాయతీ ఎంపీటీసీలు మరియు జడ్పిటిసిలు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR