Kadapa: కొండరాజుపల్లిలో కమలం జోష్: బరిలో ఎదురు భాస్కర్ రెడ్డి!
Kadapa: వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన మండలం కొండరాజుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఎదురు భాస్కర్ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు.
Kadapa: కొండరాజుపల్లిలో కమలం జోష్: బరిలో ఎదురు భాస్కర్ రెడ్డి!
కడప: కాశినాయన మండలంలో బీజేపీ జోష్ పెరిగింది. కొండరాజు పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఎదురు భాస్కర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మండల కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమానికి కాశినాయన మండల బీజేపీ అధ్యక్షుడు బీజే వెముల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పెద్దలు, బూత్ స్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భాస్కర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేర్చడానికి భాస్కర్ రెడ్డి కృషి చేస్తారన్నారు. అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను పరిష్కరించి కొండరాజు పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.




