Kasinayana: వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్ర యాదవ్ ప్రకటన!

Kasinayana: కడప జిల్లా బద్వేల్ కాశినాయన మండల జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్ర యాదవ్‌ను ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఆదిత్య రెడ్డి ప్రకటించారు.

P Upendra, Kadapa Porumamilla
Published on: 20 Oct 2026 1:02 PM IST
Kasinayana
X

Kasinayana: వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్ర యాదవ్ ప్రకటన!

Kasinayana: బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన మండలం, వరికుంట్ల పంచాయతీ పరిధిలోని నాయనపల్లి గ్రామానికి చెందిన చంద్ర యాదవ్ గారిని జడ్పీటీసీ అభ్యర్థిగా బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ శ్రీ డి.సి. గోవిందరెడ్డి గారు, నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలందరూ ఐకమత్యంతో పనిచేయాలని, ప్రజల మద్దతుతో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు."*

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla