Kadapa: కడప జడ్పీ చైర్మన్‌గా పుత్తా నర్సింహారెడ్డి ఎన్నిక

Kadapa: వైఎస్సార్ కడప జడ్పీ చైర్మన్‌గా పుత్తా నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్‌గా హబీబున్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు; కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన ప్రమాణ స్వీకారం.

G. RAVI KUMAR, KADAPA
Published on: 20 Nov 2026 6:18 PM IST
Kadapa
X

Kadapa: కడప జడ్పీ చైర్మన్‌గా పుత్తా నర్సింహారెడ్డి ఎన్నిక

కడప: వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పుత్తా నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్‌గా హబీబున్నీఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. వీరనాయునిపల్లె జెడ్పీటీసీ సభ్యుడు పుత్తా నర్సింహారెడ్డి పేరును చైర్మన్ పదవికి, పోరుమామిళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు హబీబున్నీ పేరును వైస్ చైర్మన్ పదవికి ప్రతిపాదించగా, ఇతరుల నుంచి పోటీ లేకపోవడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జెడ్పీ చైర్మన్ పుత్తా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలాల అభివృద్ధికి కృషి చేస్తామని, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, టీడీపీ జిల్లా ఇన్‌చార్జి భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA