Kadapa: డీఎస్పీకి వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి ఫిర్యాదు!
Kadapa: కడపలో నామినేషన్ కేంద్రాల వద్ద అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తోందని వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి దీప్తి, పాకా సురేష్ డీఎస్పీ భవానీకి ఫిర్యాదు చేశారు.
Kadapa: డీఎస్పీకి వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి ఫిర్యాదు!
కడప: కడప లో అధికార పార్టీ నేతలు నామినేషన్ దౌర్జన్యాలు చేస్తున్నారంటూ కడప నగర మేయర్ అభ్యర్థి దీప్తి, మాజీ నగర మేయర్ పాక సురేష్ తమ అనుచరులతో కలిసి వచ్చి కడప డిఎస్పి భవాని కి వినతిపత్రం సమర్పించారు.
గాంధీనగర్ స్కూలు సీఎస్ఐ చర్చి వద్ద ఉన్న మున్సిపల్ స్కూలు వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద తమ అభ్యర్థుల నామినేషన్ లాక్కుని చించి వేశారని వారు డిఎస్పి కి ఫిర్యాదు చేశారు.
అలాగే తమ అభ్యర్థులపై దాడులు చేశారని వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు నామినేషన్ లాక్కున్న సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా డీఎస్పీకి సమర్పించారు.
కడప డిఎస్పి కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వైసీపీ మేయర్ అభ్యర్థి దీప్తి రెడ్డి మాజీ మేయర్ సురేష్ దాడికి గురైన వైసిపి నాయకులు.




