Kadapa: సీఎం రమేష్ నివాసంలో సీఎం సురేష్‌ను పరామర్శించిన కేంద్ర మంత్రి
Kadapa: కడప జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పొట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురష్‌నాయుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ఆరా.
Kadapa: సీఎం రమేష్ నివాసంలో సీఎం సురేష్‌ను పరామర్శించిన కేంద్ర మంత్రి
కడప: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు కడప జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదటగా కడప విమానాశ్రయానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం యర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామంలోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వగ్రామానికి విచ్చేశారు. అక్కడి నివాసంలో ఎంపీ కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి కలిశారు.
ఇటీవల కాలు గాయపడిన సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ నాయుడిని రామ్మోహన్ నాయుడు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.




