Kadapa: కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయండి రైతు సేవా సమితి విజ్ఞప్తి

Kadapa: కడప జిల్లా మైదుకూరు కేసీ కెనాల్ ఈఈకి రైతు సేవా సమితి వినతి. ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోతున్న మినుము, జొన్న పంటలను కాపాడేందుకు నీరు విడుదల చేయాలని విజ్ఞప్తి.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 9 Nov 2026 3:09 PM IST
Kadapa
X

Kadapa: కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయండి రైతు సేవా సమితి విజ్ఞప్తి

కడప: కడప జిల్లాలోని కేసీ. కెనాల్ ఆయకట్టు రైతుకు నీరు విడుదల చేసి పొలాల్లో ఎండిపోతున్న మినుము, జొన్న పంటలను కాపాడాలని రైతు సేవాసమితి జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ కేసీ. కెనాల్ అధికారులను కోరారు.

ఈ రోజు ఏవి.రమణ రైతులతో కలిసి మైదుకూరు కే సి.కెనాల్ డివిజన్ కార్యాలయంలో ఉన్న జూనియర్ ఇంజనీర్ సుబ్బరాయుడు గారిని కలిసి ఆయకట్టు రైతుల పరిస్థితిని వివరించి ఎలిననో ప్రభావంతో పకృతి వర్షం కూడా లేక ఎండిపోతున్న జొన్న, మినుములు పంటలను కాపాడుకునేందుకు,

ఆయా రైతుకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అధికారి సుబ్బరాయుడు గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు శివ నాగిరెడ్డి, రామ సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, వీరారెడ్డి, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR