Kadapa: కడపలో ఎర్రచందనం అక్రమ రవాణా భగ్నం
Kadapa: కడప జిల్లాలో 1.984 టన్నుల ఎర్రచందనాన్ని సీజ్ చేసి 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రెస్ మీట్లో తెలిపారు. విలువ రూ. 1.30 కోట్లు.
Kadapa: కడపలో ఎర్రచందనం అక్రమ రవాణా భగ్నం
కడప: 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలు స్వాధీనం కాఫీ పొడి ప్యాకెట్ల లోడు చాటున ఎర్ర చందనం తరలిస్తున్న ముఠా మూడు వాహనాలు, 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలు సీజ్,సీజ్ చేసిన మొత్తం విలువ రూ.1.30 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం.పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నించిన స్మగ్లర్లు.
ఎస్.ఏ. కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో ఘటన తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన ఒకరు అరెస్ట్ మరికొందరు పరారీలో ఉన్నట్లు ఎస్పి వెల్లడి ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరిక పునరావృత నేరస్తులపై అవసరమైతే పీడీ యాక్ట్ అమలు కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ జిల్లాలో అక్రమంగా రవాణా చేపట్టడానికి ప్రయత్నించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక ను జారీ చేశారు.




