Kadapa: కడప, పులివెందులలో మొదటి రోజు వైఎస్సార్‌సీపీ నామినేషన్లు దాఖలు!

Kadapa: కడపలో మేయర్ అభ్యర్థి బండి దీప్తి, పులివెందులలో ప్రమీలమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. గాంధీనగర్ కేంద్రం వద్ద ఘర్షణలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 16 Oct 2026 9:55 PM IST
Kadapa
X

Kadapa: కడప, పులివెందులలో మొదటి రోజు వైఎస్సార్‌సీపీ నామినేషన్లు దాఖలు!

కడప: మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియలో ప్రక్రియలో వైఎస్ఆర్సిపి పులివెందుల కడప అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కడప కార్పొరేషన్ కు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బండి దీప్తి నామినేషన్ చేయగా, పులివెందుల లో వైయస్ ప్రమీలమ్మ వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్మన్ భట్టిగా నామినేషన్ దాఖలు చేశారు.

కడప ప్రొద్దుటూరు, మైదుకూరు, తదితర ప్రాంతాల్లో కౌన్సిలర్ అభ్యర్థులు కూడానామేష్ దాఖలు చేశారు. కడప నగరంలోని గాంధీనగర్ స్కూల్ నామినేషన్ కేంద్రం వద్ద 20 నుండి 36 డివిజన్లో కు సంబంధించిన నామినేషన్లు దాఖలు చేయడానికి వైసిపి నేతలు రావడంతో వారి చేతుల్లోని నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు లాక్ కి వెళ్లారు.

దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. లోని ఒక నామినేషన్ కేంద్రం వద్ద మాజీ కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి రాగా వారి నామినేషన్లను లాక్కెళ్లే ప్రయత్నం జరిగింది.అక్కడ కూడా గొడవ జగరగడంతో రంగ ప్రవేశం చేశారు దీంతో అక్కడ గొడవ సద్దుమణిగింది.

రేపు నామినేషన్ల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప కార్పొరేషన్ లో కార్పొరేటర్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ నాయకులపై దాడి దృశ్యం

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA