Pulivendula: పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గీతాకుమారి ప్రమాణ స్వీకారం!
Pulivendula: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా తూగుట్ల గీతాకుమారి, 40 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.
Pulivendula: పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గీతాకుమారి ప్రమాణ స్వీకారం!
పులివెందుల: పులివెందుల మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తూగుట్ల గీతాకుమారి ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం ఎన్నికైన 40 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రిసైడింగ్ అధికారి చిన్నయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కౌన్సిలర్లు హాజరై ప్రమాణ స్వీకారం చేయగా, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరి పులివెందుల మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఎలాంటి నిర్ణయాలతో ముందుకు సాగనుంది? వైస్ చైర్మన్ పీఠం ఎవరిని వరించనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.




