Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రూ.1.63 కోట్ల ఎగ్జిబిషన్ బకాయిల దుమారం!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రూ.1.63 కోట్ల ఎగ్జిబిషన్ బకాయిల వసూలు వ్యవహారంలో ఎమ్మెల్యే, కమిషనర్ విఫలమయ్యారని మాజీ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి ఆరోపించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 17 Nov 2026 5:46 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రూ.1.63 కోట్ల ఎగ్జిబిషన్ బకాయిల దుమారం!

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రూ. 1.63 కోట్ల ఎగ్జిబిషన్ బకాయిల వసూలు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంపై మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు.

పాత్రికేయుల సమావేశంలో పాతకోట బంగారు మునిరెడ్డి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ శివకుమార్ నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన రూ. 1.63 కోట్ల బకాయిలను వసూలు చేయడంలో ఎమ్మెల్యే, కమిషనర్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. మరో రెండు రోజుల్లో కాంట్రాక్టర్ సామాన్లు సర్దుకుని వెళ్లే అవకాశం ఉందని, ఈ విషయంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మౌనం వహించడం సందేహాలకు తావిస్తోందని బంగారు మునిరెడ్డి పేర్కొన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండానే, గెజిట్ నిబంధనలకు విరుద్ధంగా మూడు విడతల్లో డబ్బులు చెల్లిస్తామన్న కాంట్రాక్టర్ అఫిడవిట్‌ను కమిషనర్ ఏ అధికారంతో ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఈ బకాయిల వివరాలపై సమాచారం కోరిన ఒక మహిళకు కమిషనర్ స్పందించకపోవడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, త్వరలోనే అధికారులకు కోర్టు నోటీసులు అందనున్నాయని బంగారు మునిరెడ్డి తెలిపారు. ఇదే అంశంపై గతంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా హెచ్చరించారని ఆయన గుర్తుచేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR