Proddatur: ప్రొద్దుటూరు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు ఏకగ్రీవం!
Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎంపీపీగా కొప్పల్ల భారతి, ఉప ఎంపీపీగా సుబ్బరాయుడు ఎన్నికయ్యారు.
Proddatur: ప్రొద్దుటూరు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు ఏకగ్రీవం!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎంపీపీగా కామనూరు టీడీపీ ఎంపీటీసీ కొప్పల్ల భారతి, ఉప ఎంపీపీగా కొత్తపల్లె-3 ఎంపీటీసీ సుబ్బరాయుడు ఎన్నికయ్యారు. గురువారం ప్రొద్దుటూరులోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు.
మండలంలో మొత్తం 24 మంది ఎంపీటీసీలు ఉండగా, 23 మంది సభ్యుల బలంతో అందరు ఏకగ్రీవంగా కొప్పల్ల భారతి ని ఎంపీపీగా బలపరచగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రకటించారు. ఉప ఎంపీపీ పదవికి సుబ్బరాయుడు పేరును బలపరచగా, రెండు పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ ప్రతిపధిత చైర్మన్ రాఘవరెడ్డి, షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్, లక్ష్మి రెడ్డి, ఎంపీటీసీలు, కూటమి నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




