Kadapa: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలి!

Kadapa: ప్రొద్దుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం: స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో కూటమి విజయమే లక్ష్యం.. ఓటర్ల జాబితా పరిశీలనపై శ్రేణులకు దిశానిర్దేశం.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 24 Sept 2026 5:26 PM IST
Kadapa
X

Kadapa: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలి!

ప్రొద్దుటూరు: ​ప్రొద్దుటూరు లో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన శ్రేణుల ​ఓటర్ల జాబితాను పరిశీలించుకొవాలి..సమన్వయ కమిటీ సభ్యుడు ఏ రామారావు తెలిపారు. ​100% స్ట్రైక్ రేట్‌తో కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి అన్నాడు. ప్రొద్దుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల కీలక సమావేశం జరిపారు

. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు పిలుపునిచ్చారు. ప్రతీ జనసైనికుడు, నాయకుడు ఐకమత్యంతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ప్రొద్దుటూరులోని జనసేన పార్టీ కార్యాలయం జనసైనికులు, నాయకులతో కోలాహలంగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ క్యాడర్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల కోసం నాయకులంతా తమ పరిధిలోని ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించుకోవాలని స్పష్టం చేశారు. పార్టీలో ఉండే జనసైనికులు, నాయకులు అందరూ విభేదాలు పక్కనబెట్టి ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు.

కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాజీ ప్రసాద్, మంచాల సంజీవ్, మడాసు మురళి, సుంకర మురళీ, కల్యాణ్ రెడ్డి, రాజు, శేగిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి, మంచి శివకుమార్ మరియు పలువురు ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR