Proddatur: ప్రొద్దుటూరు కూటమి రాజకీయాల్లో రాజుకున్న అసంతృప్తి జ్వాలలు!

Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 26 Nov 2026 10:10 AM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు కూటమి రాజకీయాల్లో రాజుకున్న అసంతృప్తి జ్వాలలు!

ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ కూటమి రాజకీయాల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల కేటాయింపులో తమ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం వరమో, శాపమో అర్థం కావడం లేదని జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్త మాదాసు మురళీ తెలిపారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ స్థానిక ఎన్నికల సమన్వయకర్త మాదాసు మురళీ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రొద్దుటూరు అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ. 3.50 కోట్ల నిధులు కేటాయించడం వరమో, శాపమో అర్థం కావడం లేదన్న మాదాసు మురళీ. ​పంచాయతీ ఎన్నికల్లోనైనా సమన్వయంతో జనసేన అభ్యర్థులకు న్యాయం చేయాలని అల్లం చంద్రశేఖర్ విజ్ఞప్తి.

రాష్ట్రవ్యాప్తంగా 82 మున్సిపాలిటీలు, 17 మేయర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో జనసేనకు సీట్లు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. కానీ, ఒక్క ప్రొద్దుటూరులో మాత్రం మున్సిపల్ వార్డుల్లో గానీ, కో-ఆప్షన్ సభ్యులుగా గానీ జనసేనకు అవకాశం కల్పించకపోవడం కూటమి ధర్మాన్ని విస్మరించడమేనని మాదాసు మురళీ అన్నారు.

​గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సీటు కేటాయిస్తే, జనసేన శ్రేణులన్నీ ఏకమై సంపూర్ణ మద్దతుతో విజయానికి కృషి చేశామని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పూర్తిస్థాయి నివేదిక పంపినట్లు మాదాసు మురళీ వెల్లడించారు. ఈ సమావేశంలో కోనేటి పవన్, రాజేష్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR