Proddatur: ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిల వివాదంపై కమిషనర్‌పై విమర్శలు!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిల వివాదంపై మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలిని టీడీపీ మాజీ ఇంచార్జ్ జి.వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 17 Nov 2026 3:21 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిల వివాదంపై కమిషనర్‌పై విమర్శలు!

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిల వివాదం స్థానిక రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలి కూటమి నాయకులకు, మున్సిపాలిటీకి చెడ్డపేరు తెచ్చేలా ఉందని టీడీపీ మాజీ ఇంచార్జ్ జి.వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎగ్జిబిషన్ వివాదంలో ముమ్మాటికీ కమిషనర్‌దే తప్పని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

గతంలో కంతుల వారీ చెల్లింపులు ఉండవని చెప్పిన కమిషనర్, ఇప్పుడు గడువు ఎలా ఇస్తారని నిలదీశారు. గతంలో ఎగ్జిబిషన్‌పై ధర్నాలు చేసిన రాచమల్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, కమిషనర్‌కు, ఆయన బామ్మర్దికి మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందా అని అనుమానం వ్యక్తం చేశారు. 90 లక్షల రూపాయల విలువైన ఎగ్జిబిషన్ సామాన్లను 3 కోట్లుగా చూపించాలని లేఖ రాయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

పాన్ కార్డు లేని వ్యక్తికి టెండర్ ఎలా కట్టబెట్టారని నిలదీస్తూ, దీనిపై ఏసీబీ (ACB), ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి చొరవ తీసుకుని బకాయిలు వసూలు చేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎగ్జిబిషన్ నుంచి ఒక్క వస్తువు బయటకు వెళ్లినా కమిషనర్‌దే బాధ్యత అని, బకాయిలు వసూలు చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కమిషనర్ ఆస్తులను అటాచ్ చేయించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలతో ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR