Proddatur: చౌటపల్లె సర్పంచ్‌గా మేకల మోహన్ (మైఖల్) ఏకగ్రీవ ఎన్నిక!
Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌటపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా మేకల మోహన్ (మైఖల్), 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో అధికారులు డిక్లరేషన్ పత్రాలు అందజేశారు.
Proddatur: చౌటపల్లె సర్పంచ్‌గా మేకల మోహన్ (మైఖల్) ఏకగ్రీవ ఎన్నిక!
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం చౌటపల్లె పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో శుక్రవారం సంబంధిత ఎన్నికల అధికారులు అధికారికంగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.. చౌటపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మేకల మోహన్ (మైఖల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి ఆయనకు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. చౌటపల్లె పంచాయతీ పరిధిలో 8 వార్డులు ఉండగా అన్ని ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వారందరికీ ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.
చౌటపల్లె సర్పంచ్ మేకలు మోహన్ మాట్లాడుతూ మొదటి నుంచి ఏకగ్రీవానికి సహకరించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టిడిపి నేత నంద్యాల కొండారెడ్డి, చౌటుపల్లె లక్ష్మిరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. చౌటపల్లె పంచాయతీ పరిధిలో మరింత వేగవంతంగా అభివృద్ధి చేసి ప్రజల మన్నలను పొందుతామని మోహన్ (మైఖల్) తెలిపారు. అదేవిధంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన 8 మంది వార్డు సభ్యులకు, మా వెంట ఉండి కూటమి కార్యకర్తలకు నా సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు.




