Kadapa: పొట్లదుర్తి ఏకగ్రీవ సర్పంచ్‌కు డిక్లరేషన్ పత్రం అందజేత

Kadapa: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి సర్పంచ్‌గా యాదం మల్లికార్జున యాదవ్, 14 వార్డు సభ్యులు ఏకగ్రీవం; డిక్లరేషన్ పత్రం అందజేసిన రిటర్నింగ్ అధికారి.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 27 Nov 2026 6:12 PM IST
Kadapa
X

Kadapa: పొట్లదుర్తి ఏకగ్రీవ సర్పంచ్‌కు డిక్లరేషన్ పత్రం అందజేత

కడప: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ సర్పంచ్‌గా యాదం మల్లికార్జున యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు పంచాయతీ పరిధిలోని మొత్తం 14 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. అనంతరం వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా 6వ వార్డు బీజేపీ సభ్యుడు పగిడాలపాటి వెంకట శివారెడ్డిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.

​ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ మల్లికార్జున యాదవ్‌కు వార్డు సభ్యులకు శుక్రవారం రిటర్నింగ్ అధికారి సంజీవ్ కుమార్ అధికారిక డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.

​ఈ సందర్భంగా సర్పంచ్ యాదం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ... తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, సీఎం సురేష్ నాయుడులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వార్డు సభ్యులకు, కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని ఆయన పేర్కొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR