Kadapa: గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పొట్లదుర్తి పంచాయతీ ఏకగ్రీవం

Kadapa: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి పంచాయతీ ఏకగ్రీవం; సర్పంచ్‌గా మల్లికార్జున యాదవ్, ఉప సర్పంచ్‌గా శివారెడ్డి ఎన్నికపై సీఎం సురేష్ నాయుడు హర్షం.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 27 Nov 2026 9:53 PM IST
Kadapa
X

Kadapa: గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పొట్లదుర్తి పంచాయతీ ఏకగ్రీవం

​​కడప: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కులమతాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఒక్కటై కూటమి మద్దతుదారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సీఎం సురేష్ నాయుడు తెలిపారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్లదుర్తి సర్పంచ్‌గా మల్లికార్జున యాదవ్‌ను, అలాగే వార్డు సభ్యులందరి ఏకాభిప్రాయంతో ఉప సర్పంచ్‌గా 6వ వార్డు సభ్యులు, బీజేపీ నేత శివారెడ్డిని ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. ఎన్నికల గొడవలు లేకుండా గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావడం సంతోషదాయకమని పేర్కొన్నారు.

నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లందరికీ తమ పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సీఎం సురేష్ నాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీ అధికారులు, బిజెపి యువ నాయకుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు..

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR