Porumamilla: రంగసముద్రం సర్పంచ్‌గా దాసరిపల్లి దివ్య ప్రమాణ స్వీకారం!
Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కూటమి అభ్యర్థి దాసరిపల్లి దివ్య, ఉప సర్పంచ్‌గా కలవకూరి రమణ ప్రమాణ స్వీకారం చేశారు.
Porumamilla: రంగసముద్రం సర్పంచ్‌గా దాసరిపల్లి దివ్య ప్రమాణ స్వీకారం!
పోరుమామిళ్ల: పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచిగా కూటమి బలపరిచిన అభ్యర్థి దాసరి పల్లి దివ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సర్పంచిగా గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బద్వేల్ నియోజకవర్గ కూటమి నాయకుడు చెరుకూరి రవినాయుడు మాట్లాడుతూ రంగసముద్రం సర్పంచిగా దాసరి పల్లి దివ్య 627 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. ఈ విజయానికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయడం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.
అదేవిధంగా పోరుమామిళ్ల గ్రామ పంచాయతీలో కూటమి బలపరిచిన సర్పంచి అభ్యర్థి రంగమ్మ 4,312 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించడం ఎంతో సంతోషదాయకమన్నారు. అలాగే రంగసముద్రం ఉప సర్పంచిగా కలవకూరి రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచి అభ్యర్థిగా పచ్చా అంకమ్మ ప్రతిపాదించగా, ఎనిమిది మంది వార్డు సభ్యులు బలపరిచారు. దీంతో కలవకూరి రమణ ఉప సర్పంచిగా బాధ్యతలు స్వీకరించారు.
నారా లోకేష్ నాయకత్వంలో, బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా సూర్యనారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలి ఎన్నికల్లోనే ఈ స్థాయిలో ఘన విజయాలు సాధించడం ఎంతో సంతోషదాయకమని చెరుకూరి రవినాయుడు అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి, ప్రజల ఆదరణతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు చేసిన విమర్శలకు ప్రజలు తమ ఓట్ల ద్వారానే సమాధానం చెప్పారని, ఈ విజయభేరితో వారి విమర్శలకు తాళం పడినట్లయిందని వ్యాఖ్యానించారు.




