Porumamilla: పోరుమామిళ్లలో ఎంపీటీసీల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు!

Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

P Upendra, Kadapa Porumamilla
Published on: 19 Nov 2026 12:16 PM IST
Porumamilla
X

Porumamilla: పోరుమామిళ్లలో ఎంపీటీసీల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు!

పోరుమామిళ్ల: పోరుమామిళ్ల మండలానికి సంబంధించి నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమ తేదీ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల మేరకు, గురువారం 19-11-2026న ఉదయం 10:00 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఈ కార్యక్రమం జరగనుంది.

నూతనంగా ఎన్నికైన గౌరవ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC) సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదేవిధంగా మండల కో-ఆప్షన్ సభ్యులు, మండల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు.

కావున నూతనంగా ఎన్నికైన గౌరవ ఎంపీటీసీ సభ్యులందరూ తప్పక ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కోరారు. ఈ కార్యక్రమానికి పత్రికా విలేకరులు కూడా తప్పక హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla