Porumamilla: ఆర్మీలో నాయక్‌గా విధులు నిర్వహిస్తున్న పసుపులేటి ప్రసాద్ మృతి!
Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామానికి చెందిన భారత సైనికుడు (నాయక్) పసుపులేటి ప్రసాద్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు.
Porumamilla: ఆర్మీలో నాయక్‌గా విధులు నిర్వహిస్తున్న పసుపులేటి ప్రసాద్ మృతి!
పొరుమామిళ్ల: పొరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామానికి చెందిన పసుపులేటి ప్రసాద్ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. ఆయన భారత సైన్యంలో నాయక్ హోదాలో విధులు నిర్వహిస్తూ దేశానికి సేవలందిస్తున్నారు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆయన మృతి చెందడంతో మార్కాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.




