Porumamilla: పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్‌గా సీతా సురేష్ ఎన్నిక!
Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా సీతా సురేష్ ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.
Porumamilla: పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్‌గా సీతా సురేష్ ఎన్నిక!
పొరుమామిళ్ల: పొరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా సీతా సురేష్ ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియలో సీతా సురేష్ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ ఎన్నిక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంగమ్మతో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు. వారి సమక్షంలో ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉప సర్పంచ్‌గా ఎన్నికైన సీతా సురేష్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు.




