Kadapa: ఓటు చోరీ ఆరోపణలు సరికాదు: బీజేపీ నేత బాలకృష్ణ
Kadapa: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు లేవని, అభివృద్ధిని ఓర్వలేకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటు చోరీ పేరిట నిరసనలు చేస్తున్నారని కడప బీజేపీ నేత బాలకృష్ణ అన్నారు.
Kadapa: ఓటు చోరీ ఆరోపణలు సరికాదు: బీజేపీ నేత బాలకృష్ణ
Kadapa: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకపోయినా.. ఓటు చోరీ పేరుతో ఢిల్లీలో ప్రతిపక్షాలు నిరసనలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు బాలకృష్ణ యాదవ్ అన్నారు. కడప ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంటే ఓర్వలేకే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయని ఆరోపించారు.
రాజ్యాంగబద్ధంగా ఓట్ల సవరణ ప్రక్రియ కొనసాగుతుంటే.. దాన్ని తప్పుపట్టడం, ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ నిరసనలు చేపట్టడం సరికాదన్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కొందరు కాంగ్రెస్ నాయకులే ఎలాంటి సమస్య లేదని చెబుతూఉంటే మరోవైపు ఏదో జరిగిపోయిందంటూ నిరసనలు చేయడం సరికాదని విమర్శించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రతిపక్షాలు విదేశీ నిధులు, ఆదేశాలతో నిరసనలు చేపడుతున్నాయంటూ ఆరోపణలు చేశారు. ఓట్ల సవరణను రాజకీయ వివాదంగా మార్చడం మానుకోవాలని సూచించారు.




