Mydukur: వనిపెంట గ్రామాభివృద్ధే ధ్యేయంగా కలిసి రావాలి: టీఎస్ఆర్ ట్రస్ట్!

Mydukur: వనిపెంట గ్రామాభివృద్ధే ధ్యేయంగా పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని టీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుభద్రమ్మ, సుబ్బరాయుడు దంపతులు పిలుపునిచ్చారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 18 Nov 2026 10:39 AM IST
Mydukur
X

Mydukur: వనిపెంట గ్రామాభివృద్ధే ధ్యేయంగా కలిసి రావాలి: టీఎస్ఆర్ ట్రస్ట్!

మైదుకూరు: వనిపెంట గ్రామాభివృద్ధే ధ్యేయంగా పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని టీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుభద్రమ్మ, సుబ్బరాయుడు దంపతులు పిలుపునిచ్చారు. వనిపెంట గ్రామంలో వారి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వనిపెంటకు రాష్ట్రస్థాయిలో మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయని, వాటిని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా వనిపెంట ఇత్తడి పరిశ్రమకు దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. గ్రామంలో వెంటనే బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ప్రధాన రహదారుల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని సభలో నిర్ణయించారు.

గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థవంతమైన, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని వారు కోరారు. ​ఈ సభలో గ్రామ పెద్దలు పాల్గొని గ్రామాభివృద్ధికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కటారు వీరన్న, ఇస్మాయిల్, శ్రీకాంత్, చిన్న వీరన్న, శివ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR