Kadapa: కడపలో నామినేషన్ల ప్రక్రియ అప్రజాస్వామికం: వైసీపీ!
Kadapa: కడపలో స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ అప్రజాస్వామికంగా సాగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికలను రద్దు చేసి ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేశారు.
Kadapa: కడపలో నామినేషన్ల ప్రక్రియ అప్రజాస్వామికం: వైసీపీ!
కడప: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అప్రజాస్వామికంగా సాగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్నారని విమర్శించారు. కడప వైసీపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు రఘునాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, జిల్లా వైసీపీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తిగా అప్రజాస్వామికంగా సాగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. పలు నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు వైసీపీ అభ్యర్థులను అడ్డుకుని నామినేషన్లు వేయకుండా చేశారని అన్నారు. అయితే, నామినేషన్లు దాఖలు చేసిన స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీలో కొనసాగుతారని స్పష్టం చేశారు.
కడప నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దాడులు జరిగాయని అంజాద్ బాషా ఆరోపించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే వారిని ఎమ్మెల్యే భర్త బహిరంగంగా హెచ్చరించారని విమర్శించారు. ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరించేలా అవకాశం కల్పించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
రెండున్నరేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం ఏకగ్రీవంగా ఎన్నికైన వారితోనూ రాజీనామాలు చేయిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు.




