Proddatur: ప్రొద్దుటూరు అమృతానగర్ చెత్త సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే!

Proddatur: ప్రొద్దుటూరు అమృతనగర్‌లో చెత్త డంపింగ్ సమస్యను తక్షణమే పరిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి స్థానిక ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 7 Oct 2026 12:36 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు అమృతానగర్ చెత్త సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే!

Proddatur: అమృతనగర్ పరిసర ప్రాంతాల్లో చెత్త వేయడం వల్ల దుర్గంధంతో పాటు, రోగాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్న ప్రజలకు ఎమ్మెల్యే తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ​అమృత నగర్ ప్రజల సమస్య తమ దృష్టికి రాగానే స్పందించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇకపై ఆ ప్రాంతంలో ఎలాంటి చెత్తను వేయకూడదని సంబంధిత అధికారులకు ఖచ్చితమైన, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీఓ (MPDO) మరియు కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి నిన్నటి దినం అమృత నగర్ ప్రజలు చేస్తున్న దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ​స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి, సమస్య తీవ్రతను పరిశీలించి, వెంటనే అక్కడ చెత్త తరలింపు మరియు శుభ్రపరిచే కార్యక్రమాలను పర్యవేక్షించారు. ​భవిష్యత్తులో ఈ ప్రాంతంలో చెత్త వేయకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

​​ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అమృత నగర్ ప్రజలతో మాట్లాడుతూ "ఇకమీదట అమృత నగర్ ప్రజలకు ఏసమస్యలు ఉన్నా, ఏ క్షణంలోనైనా నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. మీ సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత."

​"ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలసూత్రం. ఆరోగ్యం బాగుంటేనే మన పిల్లలను ఉన్నత చదువులు చదివించి, సమాజంలో మంచి స్థాయిలో నిలబెట్టుకోగలుగుతాము. ఆరోగ్యాలపై ప్రతి కుటుంబం ప్రత్యేక శ్రద్ధ వహించాలి అన్నారు. అమృత నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేయకుండా, నిరంతరం పర్యవేక్షణ ఉండేలా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదే విదంగా స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తాం.​

సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, క్షణాల వ్యవధిలో స్పందించి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అదే విదంగా సహకరించిన ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి మరియు ఇతర అధికారులకు అమృత నగర్ ప్రజలు, నాయకులు మరియు మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR