Kadapa: కడపను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
Kadapa: కడప జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి సవిత వెల్లడి. కరువు మండలాల ప్రకటన, జేజేయం నిధులు, పరిశ్రమలపై కలెక్టరేట్‌లో సమీక్ష.
Kadapa: కడపను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
కడప: కడప జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సవిత తెలిపారు.కడప కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది.
ఇన్‌చార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల పురోగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో అభివృద్ధి, పరిశ్రమలతో పాటు ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు.
ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని తెలిపారు.ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు.
జిల్లాలోని 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని వెల్లడించారు.జిల్లా అభివృద్ధి కోసం జేజేయం ద్వారా రూ.420 కోట్లు కేటాయించామని తెలిపారు.
స్టార్టప్ కడప,ఇన్వెస్ట్ కడప కార్యక్రమాల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడుల ఆకర్షణకు కృషి చేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.




