Kadapa: కడపలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు: వైసీపీ హెచ్చరిక!
Kadapa: కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తిని గెలిపించాలని వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వైసీపీ అభ్యర్థులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు.
Kadapa: కడపలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు: వైసీపీ హెచ్చరిక!
కడప: కడప నగర మేయర్ అభ్యర్థిగా బండి దీప్తిని గెలిపించాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర కోరారు. కడప వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కడపలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తావివ్వొద్దని హెచ్చరించారు.
కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తికి మద్దతుగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర కూటమి ప్రభుత్వం నామినేషన్ల ప్రక్రియ నుంచే వైసీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. నిన్న ప్రచార సమయంలో ఇద్దరిపై కత్తితో దాడి జరిగిందని పేర్కొన్నారు. కడపలో నామినేషన్ల ఉపసంహరణకు వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని టీడీపీ నాయకులు ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
కడప జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకురావద్దని హెచ్చరించిన ఆయన... అన్యాయం చేసిన వారిని న్యాయం ముందు నిలబెడతామన్నారు. కడప నగరంలో బలిజల బలమేంటో అందరికీ తెలుసని టీడీపీలో ఉన్న బలిజలకు రాజకీయంగా ఏం చేశారని ప్రశ్నించారు.కడప నగర ప్రజలు వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తిని గెలిపించాలని వంగవీటి నరేంద్ర విజ్ఞప్తి చేశారు.




