Kadapa: శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటో మార్ఫింగ్‌పై కడపలో వివాదం!
Kadapa: కడపలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటోను మార్ఫింగ్ చేసిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మిశెట్టి చంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Kadapa: శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటో మార్ఫింగ్‌పై కడపలో వివాదం!
కడప: శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటోను మార్ఫింగ్ చేసిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మిశెట్టి చంద్రపై చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అరెస్ట్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కడపలో స్వామివారి ఫోటో మార్ఫింగ్ వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీసింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటోను తొలగించి, ఆ స్థానంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం ఫోటోను మార్ఫింగ్ చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు.
రాజకీయాల కోసం దేవుడి చిత్రాలను ఉపయోగించుకోవడం సరికాదన్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బొమ్మిశెట్టి చంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




