Kadapa: వృద్ధాశ్రమం ఆసరా కోల్పోయిన అనాధ పిల్లలకు నిత్యవసర సరుకులు పంపిణీ
Kadapa: కడప జిల్లా బద్వేల్‌లోని ఆనంద నిలయం, షాలోము అనాధాశ్రమాలలో విద్యుత్ ఉద్యోగుల సంఘం నిత్యావసర సరుకులు పంపిణీ; అధికారుల ప్రశంసలు.
Kadapa: వృద్ధాశ్రమం ఆసరా కోల్పోయిన అనాధ పిల్లలకు నిత్యవసర సరుకులు పంపిణీ
కడప: కడప జిల్లా విద్యుత్ ఉద్యోగులు సామాజిక సేవ సంఘం ఆధ్వర్యంలో బుధవారం బద్వేల్‌లోని ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం మరియు షాలోము చిన్నపిల్లల అనాధాశ్రమాలలో నిత్యావసర సరుకులను వితరణ చేశారు.
ఈ సందర్భంగా కడప జిల్లా విద్యుత్ సూపరిండెంటింగ్ ఇంజనీర్ సోమ శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు తమ సంపాదనలో నుంచి కొంత ధనాన్ని వెచ్చించి సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించడం ఆదర్శనీయమని ప్రశంసించారు.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగ శేషరెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎన్ని అవసరాలు ఉన్నప్పటికీ, రాత్రనకా, పగలనకా, ఎండనకా, వాననకా ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యవస్థలో పనిచేస్తూనే, తమ వంతుగా సమాజంలోని అవసరార్థులకు, అన్నార్తులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ఎం.వి. చలపతి, అసిస్టెంట్ ఇంజనీర్ శివకుమార్, లైన్మెన్ రమేష్, వీరయ్య తో పాటు విద్యుత్ ఉద్యోగులు, ఆశ్రమ నిర్వాహకులు రవికుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.




