Badvel: బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిధుల గోల్‌మాల్.. డీసీహెచ్ఎస్ తనిఖీ!

Badvel: కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిధుల గోల్‌మాల్ ఆరోపణలపై డీసీహెచ్ఎస్ డాక్టర్ హిమాదేవి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి విచారణకు ఆదేశించారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 13 Nov 2026 5:36 PM IST
Badvel
X

Badvel: బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిధుల గోల్‌మాల్.. డీసీహెచ్ఎస్ తనిఖీ!

బద్వేల్: కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి లో నిధుల గోల్‌మాల్‌ నేపథ్యంలో విచారణ చేపట్టేందుకు ఆసుపత్రి ని ఆకస్మి కంగా తనిఖీ చేయటం జరిగింది. ఐసీడీసీ ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు ఆసుపత్రి వ్యవహారాల్లో అధికంగా జోక్యం చేసుకుంటూ, వైద్యులను సైతం మానిప్యులేట్ చేస్తున్నారంటూ గతంలో మా దృష్టికి ఫిర్యాదులు వచ్చాయి.

గతంలో కూడా ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకురావడంతో పాటు, ఆయనను ఆసుపత్రి విధుల్లో భాగస్వామ్యం చేయకూడదని మెడికల్ ఆఫీసర్‌కు సూచించడం జరిగింది. సదరు వ్యక్తి బ్లడ్ బ్యాంక్, ఐసీడీసీకి సంబంధించిన ఉద్యోగి. ఆయన మా శాఖకు చెందిన ఉద్యోగి కాదు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది.

ప్రస్తుతం నా పరిశీలనలో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. నిధుల గోల్‌మాల్ ఎక్కడ జరిగింది. ఎవరి పాత్ర ఎంత ఉంది. అనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం.

ఈ వ్యవహారంలో ఎవరు, ఎంతటి స్థాయి అధికారులు ఉన్నా తప్పు చేసినట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం, అంటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందని ఆసుపత్రికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. నిధుల గోల్మాల్ అంశం గతంలో కూడా వెలుగులోకి వచ్చిందని తిరిగి అదే ల్యాబ్ టెక్నీషియన్ పై అవినీతి ఆరోపణలు రావటంతో ఈ అంశాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళతానని నిధుల గోల్మాల్ నిజమైతే సదరు వ్యక్తి పైన శాఖా పరమైన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL