Kadapa: మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ గెలుపే లక్ష్యం: హరినాథ్ రెడ్డి

Kadapa: రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సీపీఐ నేత పి. హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 15 Oct 2026 5:30 PM IST
Kadapa
X

Kadapa: మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ గెలుపే లక్ష్యం: హరినాథ్ రెడ్డి

కడప: ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.

కడపలో సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థలకు విధులు, నిధులు కల్పించాల్సిన ప్రభుత్వం, వాటిపై జోక్యాన్ని పెంచుతోందని విమర్శించారు. ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ.. అందుకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం జరుగుతోందన్నారు.

పట్టణ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షాలకే మురికివాడలు నీటమునిగి ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు.. పన్నుల పెంపు, నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నిరంతరం పోరాడుతోందన్నారు.

కడప జిల్లాలో వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి కడప, బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురంలో సీపీఐ పోటీ చేయనున్నట్లు హరినాథ్ రెడ్డి తెలిపారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA