Kadapa: దువ్వూరులో 'బలిజ చైతన్య సదస్సు' కరపత్రాల ఆవిష్కరణ!

Kadapa: వైఎస్ఆర్దు వ్వూరులో ఈ నెల 25న జరగనున్న బలిజ చైతన్య సదస్సు'కరపత్రాలను ఆవిష్కరించిన రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం నాయకులు సదస్సును విజయవంతం చేయాలని పిలుపు

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 6 Oct 2026 12:12 PM IST
Kadapa
X

Kadapa: దువ్వూరులో 'బలిజ చైతన్య సదస్సు' కరపత్రాల ఆవిష్కరణ!

Kadapa: రాష్ట్రంలో బలిజ కులస్థులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం నాయకులు మిద్దె శాంతి రాముడు స్పష్టం చేశారు. కడప నగరంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న "బలిజ చైతన్య సదస్సు"కు సంబంధించిన ప్రచార కరపత్రాలను సంఘం నాయకులు దువ్వూరులో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో బలిజలు తమ హక్కులను సాధించుకోవడానికి ఐక్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు. బలిజల అభ్యున్నతి, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ చైతన్య సదస్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని బలిజ కుల బాంధవులు, మేధావులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నెల 25న జరిగే సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాశం లక్ష్మీ నరసయ్య, కార్యక్రమ సమన్వయకర్త పసుపులేటి వెంకటేష్, కాపునాడు జేఏసీ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, నాయకులు సుంకర రవిశంకర్, సమతం రాము, రామాంజనేయులు, పట్టారు అరవింద్, బండి ప్రసాద్, గోపి గిరిబాబు, గాజుల జయరాం, దీటి హరి, దీటి గోపాల్, ముద్దం రమణ తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR